సొంత ఇంటి కల నెరవేరాలంటే నిరుపేదలు ఎన్నాళ్లు ఎదురు చూడాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని నిరుపేదల పిలుపుమేరకు వారి గుడిసెలను సందర్శించిన ఐక్యవేదిక.ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, పెద్దమందడి మండల అధ్యక్షులు నక్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ 20, 30 సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తున్న బుడగజంగాలు (సంచార జాతి యాదవులు) ఓటు హక్కు ఉంది, అక్కడ అడ్రస్ లో ఆధార్ కార్డు ఉండి జీవిస్తున్నా, వారిని పట్టించుకునే నాధుడులేడనీ, ప్రతి ఎన్నికల ముందు నాయకులు వచ్చి ఎలక్షన్లో ఓటు వేయండి… మీకు ఇల్లు ఇస్తామని చెప్తూ, కాలం గడుపుతున్నారే తప్ప వారికి ఇండ్లు ఇవ్వడం లేదని, ఒకరు డబల్ బెడ్ రూమ్ అని, ఇంకొకరు ఇందిరమ్మ ఇల్లు అని ఆశ చూపుతున్నారే గాని ఇల్లు ఇవ్వడంలేదని, అక్కడ వరదలు వచ్చిన సమయంలో గుడిసెలు కొట్టుకుపోయి, వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, చిన్న పిల్లలు కూడా కొట్టుకొని పోయిన సమయంలో వారిని రక్షించుకున్నారు. ఆ సమయంలో నాయకులు వచ్చి పరమార్ష చేశారే కానీ వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయలేకపోయారని, ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే కల్పించుకుని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, నక్క కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, రామస్వామి, బొడ్డుపల్లి సతీష్, నాగరాజు, రమేష్ యాదవ్,జానంపేట ఆంజనేయులు, ఎద్దుల నరసింహ, ఎద్దుల బాలయ్య, ఆవుల గోపాల్, ఆవుల నర్సమ్మ, ఎద్దుల వెంకటేష్, ఎద్దుల రాములు, ఎద్దుల శీను, తదితరులు పాల్గొన్నారు.(Story : సొంత ఇంటి కల నెరవేరాలంటే నిరుపేదలు ఎన్నాళ్లు ఎదురు చూడాలి )

