Homeవార్తలుతెలంగాణసమరానికి సై..

సమరానికి సై..

సమరానికి సై..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పెబ్బేరు మండలం బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశములో గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు నిత్యచైతన్యవంతులు అని వాళ్లకు అన్ని తెలుసు అని మన సేవాభావం,మన ప్రవర్తన,ప్రజల కోసం పోరాడే స్పూర్తి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి మనల్ని ఆదరిస్తారని అన్నారు. ఎన్నికలో డబ్బులు ప్రధానం కాదని ప్రజా సమస్యల పట్ల పోరాడే మనస్తత్వం ఉండాలని హితోపదేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆశయంతో పాటు ప్రజలలో చైతన్యం తెచ్చి డబ్బు ప్రభావం తగ్గించాల్సిన బాధ్యత కూడా మనది అని అన్నారు. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించండి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొనే వ్యక్తులను గుర్తించండి. మీ అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను అని నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ ఆద్యక్షులు గట్టు యాదవ్,మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు, వెంకటస్వామి,పట్టణ అధ్యక్షులు దిలీప్ రెడ్డి,వైస్ చైర్మన్ కరేస్వామి,మాజీ జెడ్.పి.టి.సి పెద్దింటి.వెంకటేష్,విశ్వరూపం,హరిశంకర్ నాయుడు,మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.(Story:సమరానికి సై..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!