వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ పై ర్యాలీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ టౌన్ లో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ రవికుమార్, వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్, ఉద్యానవన అధికారి రసూల్, మండల వ్యవసాయ అధికారి జీ.వరలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో సుందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ సిహెచ్ మురళీధర్, శ్రీహరి, ఏ ఈ ఓ ఆర్ అరిఫ్, అశోక్, పట్టు పరిశ్రమ శాఖ వారు విత్తనాలు ఎరువులు ,పురుగుమందుల డీలర్లు రైతు, సోదరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, టైర్లు, స్పేర్ భాగాలకు జీఎస్టీ 18% నుండి ఐదు శాతానికి తగ్గిందని ,బయోపిస్టిసైడ్స్ సూక్ష్మ పోషకాలు, వరి కోత యంత్రాలు ట్రాక్టర్ గొర్రు ,నాగళ్ళు జీఎస్టీ 12 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించబడి రైతులకు కొనుగోలు చేయటానికి అందుబాటు ధరలోకి వచ్చాయని రైతు సోదరులకు ఉపయోగపడుతుందని అన్నారు.(Story:వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ పై ర్యాలీ..)

