Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూట‌మి ప్ర‌భుత్వం

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూట‌మి ప్ర‌భుత్వం

0

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన

కూట‌మి ప్ర‌భుత్వం

న్యూస్ తెలుగు /సాలూరు : ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కుటమీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ బుక్ కు ఇది పోటీ కాదని వైసీపీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని తెలియజేసారు. భారత రాజ్యాంగం రాముడి పాలన అయితే, రెడ్ బుక్ రాజ్యాంగం రావణాసురుడు పాలనగా తలపిస్తుందని అన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత,మాజీ సీఎం వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొద్ది రోజులు క్రితం డిజిటల్‌ బుక్‌ లాంచ్‌ చేశారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని,అధినేత జగనన్న అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు.ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి కానీ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారని అన్నారు. రెడ్‌బుక్ అరాచ‌కాలు చూశామ‌ని,వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక డిజిట‌ల్ బుక్ ఏంటో చూపిస్తామ‌ని కూట‌మి నేత‌ల‌ను హెచ్చ‌రించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని,వైసీపీ నాయకులపై,కార్యకర్తలపై,వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులపై అక్రమ, కేసులు వైసీపీ సోషల్ మీడియా వారిపై అక్రమంగా కేసులు పెడుతూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారన్నారని తెలిపారు.. వైసీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందని కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్‌లో చర్యలు ఖాయమన్నారు.ఎక్కడున్నా వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్‌ బుక్‌’లో నమోదు చేయవచ్చన్నారు.డీబీ.డబ్ల్యూఈవైయస్‌ఆర్‌సీపీ.కామ్‌ అనే వెబ్‌సైట్‌ లో గానీ, 040–49171718 నంబర్‌కు కాల్‌ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇబ్బంది పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, మక్కువ మండల జడ్పిటిసి మావుడి.శ్రీనివాస్ నాయుడు , సాలూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు.అప్పలనాయుడు , సాలూరు మండలం వైస్ ఎంపీపీ రెడ్డి.సురేష్ పిరిడి రామకృష్ణ, ఎం.ఎస్ నారాయణ, కాకి పాండురంగ తాజా,మాజీ వైసీపీ ప్రజా ప్రతినిధులు,వివిధ వైసిపి అనుబంధ విభాగాల చైర్మన్లు,వైస్ చైర్మన్లు,సభ్యులు,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story :ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూట‌మి ప్ర‌భుత్వం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version