ఈదురు గాలులకు నేల మట్టమైన అరటి, మొక్కజొన్న..
న్యూస్ తెలుగు /సాలూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తుఫాను వలన సాలూరు మండలంలో 376 ఎకరాల అరటి, 305 ఎకరాల మొక్కజొన్న నష్టం వాటిల్లిందని సాలూరు వ్యవసాయ అధికారి కె శిరీష తెలిపారు. శుక్రవారం సాలూరు మండలం నెలిపర్తి లో ఆమె పర్యటించారు. అదేవిధంగా ఉద్యాన శాఖ అధికారి ప్రత్యూష భాను ఈ ఇద్దరు వర్షానికి ఈదురు గాలులకు నేల మట్టమైన అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామం స్థాయిలో ఉన్న వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సహాయకులు, తో కలిపి ఈ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో శిరీష మాట్లాడుతూ శుక్రవారం కురిసినవర్షానికి, ఈదురుగాలులకి కొంతవరకు మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లదని తెలిపారు , ముఖ్యంగా మండలంలో ఉన్న కొదమ , పట్టుచేన్నారు, జిల్లేడువలస, సంపంగిపాడు, గంజాయిభద్ర, కురుకుటి, తొనాం, మావుడి , కందుల పదం, మరిపల్లి గ్రామాల్లో నష్టపోయిన 12 పరిశీలించి ప్రాథమిక నష్టం గా మొక్కజొన్న 305 ఎకరాలు, అరటి 376 ఎకరాలు నష్టం వాటిల్లిందని అంచనా వేయటం జరిగిందని తెలియజేసారు. (Story:ఈదురు గాలులకు నేల మట్టమైన అరటి, మొక్కజొన్న..)
