మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి
శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
దసరా కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేసిన జీవీ
సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’పై అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందని, సీఎం చంద్రబాబు, కూట మి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పని చేస్తున్నట్లు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. సూపర్‌సిక్స్ పథకాల్లో ప్రతి అడుగు ఆ విషయం దృష్టిలో పెట్టుకునే రూపకల్ప న చేయడం జరిగిందని, ఇప్పుడు మహిళలంతా ఆ ఫలితాలు చూస్తున్నారన్నారు. తల్లికివందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను సమర్థంగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు, సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా, దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ నాడు డ్వాక్రా గ్రూపులు, దీపం పథకం మొదలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని గుర్తు చేస్తూ, తెలుగుదేశం పార్టీ పుట్టుకే పేదలు, మహిళలు, రాష్ట్రాభివృద్ధికే అంకితం అయిందని తెలిపారు. జగన్ హయాంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు నాలుగు సార్లు పెంచారన్న జీవీ కూటమి ప్రభుత్వం రావడంతోనే ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు సాధారణ ప్రయాణం నుండి ఉద్యోగ, ఉపాధి అవకాశాల వరకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. పింఛన్లు పెంచడంలో చంద్రబాబుకి జగన్ దరిదాపుల్లోకి కూ డా రాలేడన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో మహిళల కష్టాలు ప్రత్యక్షంగా చూసి, వాటి పరిష్కారానికి అనేక చర్యలు చేపట్టారని వివరించారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20వేల సహాయం అందిస్తున్నామని, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ “పల్లె పండుగ” ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. గడిచిన జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, గ్యాస్ పొయ్యిలు లేకపోయినా, కల్తీ మద్యం విక్రయంతో 32వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 35లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో ఆ పరిస్థితి మారిందని, నాణ్యత పెరిగి ధరలు తగ్గాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
*శివశక్తి ఫౌండేషన్ తరఫున సివిల్స్ శిక్షణ అభ్యర్థులకు ఉపకారవేతనాలు…
శివశక్తి ఫౌండేషన్ తరఫున సివిల్స్ శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్కాలర్‌షిప్‌లు, సేవాలాల్ దేవాలయం నిర్మాణానికి రూ.5లక్షల విరాళం ప్రకటించారు. అదనంగా సేవాలాల్ ఆలయం పక్కనే కమ్యూనిటీ హాల్, వినుకొండ పట్టణంలో తాగునీటి సదుపాయాలు, రూ.3 కోట్లతో టీటీడీ కల్యాణమండపం, రామలింగేశ్వరస్వామి ఆలయం, ఘాట్ రోడ్, ఎన్నెస్పీ మైదానంలో అభివృద్ధి పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
*జీఎస్టీ 2.0తో పేద, మధ్యతరగతికి లబ్ది…
జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్యతరగతికి ఊరటనిస్తాయని గుర్తు చేశారు చీఫ్‌విప్ జీవీ ఆంజనే యులు. ఇంట్లో రోజూ వాడే సబ్బులు, షాంపులు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, కలర్ టీవీలు వంటి వస్తువులపై పన్ను తగ్గింపుతో ప్రజలకు పెద్ద మేలు కలిగిందని, అనేక వస్తువులు 0–5% పన్ను పరిధిలోకి రావడం ద్వారా జీవన వ్యయాలు తగ్గాయని తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. (Story:మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి)

