నిర్విరామ శ్రమయే విజయ రహస్యం
న్యూస్ తెలుగు/ వినుకొండ : జీవితంలో అనుకున్నా లక్ష్యాన్ని సాధించేందుకు నిర్విరామంగా శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి.సీతారాం బాబు అన్నారు. డీఎస్సీ 2025లో తమ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని టీచర్ ఉద్యోగాలు సాధించిన నలుగురు అభ్యర్థులను కళాశాల ప్రాంగణంలో అభినందించి విజేతలకు ఆయన ఘనంగా సత్కరించారు. డీఎస్సీ 2025లో విజయం సాధించిన పూర్వ విద్యార్థులు రావిపాటి అంజలీదేవి (ఎస్ ఏ సోషల్), కంచర్ల శ్రీనివాసరావు (ఎస్ ఏ పి ఈ), షేక్ కరీ మున్నిసా బేగం (ఎస్ ఏ సోషల్), ఎం జ్యోతి (ఎస్ జి టి) ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులను ప్రిన్సిపల్ ఆర్ యోగి మరియు అధ్యాపకులు అభినందించారు.(Story:నిర్విరామ శ్రమయే విజయ రహస్యం)

