Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 90వ అన్నదానం..

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 90వ అన్నదానం..

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 90వ అన్నదానం..

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం కార్యాలయం ఆవరణలో క్రమం తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తున్న బిపి శ్యామ్ సుందర్రావు వారి ధర్మపత్ని శ్రీమతి పుష్ప సహకారంతో శనివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. సంఘం గత 14 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా శనివారం 90వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులందరి సహాయ సహకారాల తో ముందుముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, జి నాగేంద్రుడు, వైవి సుబ్బయ్య శర్మ, కృష్ణమూర్తి, అవ్వారు కోటేశ్వరరావు, ఎం.వి శర్మ, ఆది రాములు, రాఘవయ్య, శంకరరావు, సిహెచ్ దీక్షితులు, రామలింగేశ్వర రావు, వెంకటస్వామి, గోపి, రఘు, దుబ్బల దాసు, ఏ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.(Story:విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 90వ అన్నదానం..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!