సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు, జగన్‌కు పోలిక ఎక్కడ?
చంద్రబాబు అంటే పారిశ్రామిక ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్
పల్నాడులో పరిశ్రమలు పెట్టాలని అసెంబ్లీ వేదికగా సీఎంకు జీవీ విజ్ఞప్తి
పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మాట్లాడిన జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో సంపద సృష్టి, పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్ పోలికే లేదని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన అభివృద్ధి, 2019-24 మధ్య జగన్ చేసి న అరాచకాలే అందుకు నిదర్శనమన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మిస్తే 30లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, హైదారాబాద్‌ను దేశ పటంలోనే ముందు వరసలో నిలిచేలా చేశారన్నారు. కానీ దోపిడీ వేధింపుల తప్ప మరేం పట్టని జగన్ రాష్ట్రంలో ఉన్న అమర్‌రాజా, లూలూ వంటి సంస్థల్ని తరిమేసి ఉన్న ఉద్యోగాలు లేకుం డా చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలంతా చంద్రబాబును మంచి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటూ ఉంటే జగన్‌ను దోపిడీ, పరిశ్రమలను వెళ్లగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చూస్తారని చురకలు వేశారు. శుక్రవారం శాసనసభలో పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై చర్చ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు. ఏ రాష్ట్రమైన నెంబర్-1గా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని, తద్వారా ఉద్యోగాలు, పరిశ్రమల ఆదాయాల నుంచి పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. అలా సంపదసృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే అలానే సైబరాబాద్‌ను నిర్మించి 30లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఆ ఫలితాలు అందుకుంటోందని, దక్షిణ భారతంలోనే హైదరాబాద్ నుంచి ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారని, దానికి కారణం చంద్రబాబు విజన్, వేసిన పునాదేనని పేర్కొన్నారు. అలానే లోకేష్ యువగళం పాదయాత్రలో యువత కష్టాలు, వారి సమస్యలు విని అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. 15నెలల కాలంలోనే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పం దాలు చేసుకున్నారు. తద్వారా 9లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ అయిదేళ్ల లో 20లక్షలమందికి ఉద్యోగాలు కల్పించడం, వారి ఆర్థిక ప్రగతిని మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. చంద్రబాబు అంటే పారిశ్రామిక ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ అయితే జగన్ ఉన్న పరిశ్రమల్ని తరిమి వేయడంలో బ్రాండ్ అంబాసిడర్ అని, సంపద లూటీలో కూడా జగనే బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అమర్‌రాజా బ్యాటరీ వంటివాళ్లను తరిమేస్తే తెలంగాణ పది లక్షల ఉద్యోగాలు తరలి పోయాయి. రాయలసీమలో ఉపాధికి గండికొట్టారు. పీపీఏలు రద్దు అంటూ పరిశ్రమలు రావాలంటే భయపడేలా చేశారని మండిపడ్డారు. లూలూ వంటి ఎన్నో సంస్థల్ని బెదిరించారని, లంచాల కోసం వేధించారన్నారు. జగన్ దోపిడీ విధానాల కారణంగా ఉన్నవి పారిపోయాయని, వచ్చే పరిశ్రమలు ఆగిపోయాయన్నారు. ఎంతసేపు వాళ్లకేంటని తప్ప, యువత, రాష్ట్రం గురించి ఆలోచించలేదన్నారు. వారిని రోడ్డున పడేసి తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితి మార్చుతున్నారని, నమ్మకం కలిగిస్తూ పరిశ్రమల్ని తిరిగి తీసుకుని వస్తున్నారన్నారు. జగన్ ఏటా డీఎస్సీ అని అయిదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన స్వల్ప వ్యవధిలోనే మంత్రి లోకేష్ మెగా డీఎస్సీ నిర్వహించి 16వేల 37మందికి ఉపాధ్యాయ పోస్టింగ్‌లు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. పరిశ్రమల ఆకర్షణలో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని, ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని, అందుకోసమే నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పరిశ్రమల్ని ఆకర్షించి ప్రోత్సహిస్తున్నారని, పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారిని ఒప్పించి పెట్టుబడులు, ఉపాధిని తీసుకుని వస్తున్నారని తెలిపారు. రానున్న 15, 20 ఏళ్లు కూడా ఎన్డీయే ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, లక్షల కోట్ల పెట్టుబడు లు ఆకర్షించి దేశంలోనే ఏపీ అత్యుత్తమ స్థానంలో నిలవనుందన్నారు. అమరావతి అభివృద్ధి ద్వారా కొందరికి ఉద్యోగాలు వస్తాయని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీగా పెట్టుబడులతో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. విశాఖను రాష్ట్ర ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని, దేశంలోనే విశాఖ నంబర్-1 ఐటీ కేంద్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో నూ బాగా వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబా బుకి విజ్ఞప్తి చేశారు. తద్వారా చదువుకున్న వేలాదిమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. (Story:సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు, జగన్‌కు పోలిక ఎక్కడ?)
