Home వార్తలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ

ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ

0

ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి :  తెలంగాణ సాయుద పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. 131వ జయంతి సందర్బంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ వీరనారి తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది చాకలి ఐలమ్మ తన చిన్న వయసులోనే భూస్వామ్య వ్యతిరేకంగా శక్తివంతమైన పోరాటాన్ని చేపట్టి, భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ గారిని స్మరించుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ గారు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి ఆదర్శం అని వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయంల ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version