విద్యార్థులు సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో బుధవారం *జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని, మానవసేవే మాధవసేవ అని, సమాజ సేవా కూడా చదువులో భాగమేనన్నారు. యువత చెడు వ్యసనాలకులోను కాకుండా ఉత్తమ పౌరులుగా తయారు కావాలన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్. శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సేవ చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసాభివృద్ధి చెందుతుందన్నారు. కళాశాల సీనియర్ అద్యాపకులు జి. వెంకట్రావు మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. వి.కె.ఆర్. వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం ( యన్ ఎస్ ఎస్ ) కార్యక్రమాన్ని ప్రారంభించారని, విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు సమాజంలో సామాజిక సేవా కలిగి ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి జి.హారతి మాట్లాడుతూ జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదున్నారు. విద్యాభ్యాసనికి ఆటంకాలు లేకుండా సమాజ సేవా చేసే అవకాశం ఎన్ఎస్ఎస్ కల్పిస్తుందన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జి. సాయికుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనుట వలన నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. అనంతరం కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story:విద్యార్థులు సేవాగుణాన్ని అలవర్చుకోవాలి)

