గంజాయి పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు
న్యూస్ తెలుగు /చింతూరు : ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చింతూరు పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ, చింతూరు ఏ ఎస్ పి పంకజ్ కుమార్ మీనా, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపారు. ఈ మేరకు చింతూరు పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతిరోజు వాహనాలు తనకి నిర్వహించడమే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ రూపేణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి చింతూరు ఆర్ టీ సి బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో వస్తుండగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలు ఆరు కేజీల గంజాయి పట్టుబడింది.. విలువ 30 వేల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. గంజాయితోపాటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆశిష్ సర్కార్, జీత్ మండల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్ తో పాటు, వద్దనున్న సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. అరెస్ట్ చేసిన ముద్దాయిలను రంపచోడవరం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. (Story:గంజాయి పట్టివేత.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు)
