Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బర్లీ పొగాకు వేయవద్దు..

బర్లీ పొగాకు వేయవద్దు..

0

బర్లీ పొగాకు వేయవద్దు..

తహసిల్దార్ సురేష్ నాయక్

న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ తాసిల్దార్ కార్యాలయంలో బ్లాక్ బెర్లి, టొబాకో సాగు చేయటం నిషేధమని టాస్క్ ఫోర్స్ కన్వీనర్, తహసిల్దార్ సురేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి జీ. వరలక్ష్మి , ఉద్యానవధికారి రసూల్ అన్నారు. మండలంలోని వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారులకు బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో విలేజ్ ఉద్యానవన అధికారులకు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక తహసిల్దార్ సురేష్ నాయక్ మాట్లాడుతూ. మండలంలోని ఏ ఒక్క రైతు కూడా బ్లాక్ బర్లి పొగాకు పంటను సాగు చేయవద్దని, రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు. ఏ ఒక్క రైతు అయినా బ్లాక్ బర్లి పొగాకు పంటను సాగు చేసినట్లయితే టాస్క్ ఫోర్స్ అధికారుల ద్వారా పంట చెడగొట్టడం జరుగుతుందని అన్నారు. వైట్ బర్లి వేసే రైతులు కూడా తప్పనిసరిగా కంపెనీ వారి నుండి బాండ్డు పొందిన తర్వాత మాత్రమే బాండ్డ్ లో చూపించినంత విస్తీర్ణం మాత్రమే వేయాలని తెలిపారు. (Story:బర్లీ పొగాకు వేయవద్దు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version