Home వార్తలు తెలంగాణ తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ

తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ

0

తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ అని వనపర్తి జిల్లాలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం ఐ.డి. ఒ.సి ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు పూజలు చేసి ప్రారంభోత్సవం చేశారు. మహిళలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలకు తీరొక్క పూవులను సేకరించి ఒక్కొ పువ్వును అలంకారంగా పేర్చి మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను కూర్చోపెట్టి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని అన్నారు. ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ప్రతి రోజు కొన్ని ప్రభుత్వ శాఖల ద్వారా బతుకమ్మ వేడుకలో పాల్గొంటారని, సెప్టెంబర్ 30 న సద్దుల బతుకమ్మ వేడుకలను పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసే విధంగా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ వేడుకలను జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా వచ్చి వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు.
కలెక్టర్ బతుకమ్మకు పూజలు చేసిన అనంతరం మహిళలు బొడ్డెమ్మలు వేసి ఆడారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ , జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, అధికారులు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version