ఈ నెల 26న బి.ఆర్.ఎస్ ఆధ్వర్యములో లంబాడీల భేరి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కె.సి.ఆర్ లంబాడీల భవిష్యతు కోసం అనేక సంక్షేమ పథకాలు పోడు భూములకు పట్టాలు ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు కళ్యాణ లక్ష్మీ,రైతు భరోసా, రైతు బీమా,రైతు రుణ మాఫీతో లంబాడీల రిజర్వేషన్లకు భాగం వాటిల్లకుండా మా హక్కులు కాపాడితే నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మంత్రి సీతక్క ఎస్.టి.జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసులు వేయించాడని తీవ్రంగా ఖండించారు. ఎస్.టి. జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగ బి. ఆర్.ఎస్ ఆధ్వర్యములో ఈ నెల 26న లంబాడీల భేరి నిర్వహిస్తున్నామని లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్నికి మద్దతు తెలపాలని నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన సన్నాహక సమావేశములో జిల్లా ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్, జాతృ నాయక్ పిలుపునిచ్చారు. ఆర్థికంగా,రాజకీయంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి నాటి అనాటి ప్రధాని ఇందిరమ్మ రిజర్వేషన్లు కల్పిస్తే నేడు వచ్చిన కల్తీ కాంగ్రెస్ నాయకులు లంబాడీలను ఎస్.టి జాబితాను తొలగించాలని చూస్తున్నదని నిప్పులు చెరిగారు.
మా పోరాటం ఆదివాసులకు వ్యతిరేకం కాదని మా రిజర్వేషన్లకు భంగం కలిగించవొద్దని మా పోరాటం అని నాయకులు స్పష్టం చేశారు. 26న జరిగే లంబాడీల భేరికి రావాలని గిరిజన నాయకుల ఆహ్వానం మేరకు సన్నాహక సమావేశములో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ లంబాడీల నోటికాడి ముద్దను కాంగ్రెస్ పార్టీ లాక్కోవాలని చూస్తుందని దీని బి.ఆర్.ఎస్ పార్టీ సహించదని హెచ్చరించారు. రాష్ట్రములో ఉన్న ఆదివాసులకు తాము వ్యతిరేకం కాదని కానీ గిరిజనులను ఎస్.టి జాబితా నుండి తొలగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడీలు చేసే న్యాయమైన పోరాటానికి మా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
నారాయణ నాయక్, టీక్యా నాయక్,కృష్ణా నాయక్,గోపాల్ నాయక్, పీన్యా నాయక్,రమేష్ నాయక్,శ్రీను నాయక్,రాజ్ కుమార్ నాయక్,గోవిందు నాయక్,పెద్దమందడి.కృష్ణా నాయక్,శక్రూ నాయక్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (Story:ఈ నెల 26న బి.ఆర్.ఎస్ ఆధ్వర్యములో లంబాడీల భేరి)

