Homeవార్తలుతెలంగాణతురుక కాశలకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

తురుక కాశలకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

తురుక కాశలకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

-తురుక కాశ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు షేక్ గౌస్..
– హుస్నాబాద్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసీం

న్యూస్ తెలుగు సిద్దిపేట/హుస్నాబాద్:తురుక కాశ కులస్తుల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని తురుక కాశ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షేక్ గౌస్ తో పాటు హుస్నాబాద్ అధ్యక్షులు మహమ్మద్ ఖాసీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బడే సాబ్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో ఆయా మండలాలకు తురుక కాశ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.హుస్నాబాద్ తురుక కాశ సంఘం అధ్యక్షులుగా మహమ్మద్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా షేక్ నూర్ మహమ్మద్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తురుక కాశ కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారని ఆందోళన వెలిబుచ్చారు. బండలు, రాళ్లు కొడుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఇతర అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనుకబాటుతనానికి గురౌతున్నారని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తురుక కాశ కులస్తుల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడంతోపాటు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించాలని కోరారు. ప్రమాదాల బారిన పడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలని, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కటించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ తురుక కాశ సంక్షేమ సంఘ అధ్యక్షుడు షేక్ ఖాసీంతో పాటు తురుక కాశ సంక్షేమ కులస్తులు పాల్గొన్నారు. (Story:తురుక కాశలకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!