Home వార్తలు తెలంగాణ గత పదేళ్ల బిజెపి పరిపాలనలో ఆదాని అంబానీ లే బాగుపడ్డారు

గత పదేళ్ల బిజెపి పరిపాలనలో ఆదాని అంబానీ లే బాగుపడ్డారు

0

గత పదేళ్ల బిజెపి పరిపాలనలో ఆదాని అంబానీ లే బాగుపడ్డారు

సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయ రాములు

న్యూస్ తెలుగు/వనపర్తి  : గత పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో ఆదాని అంబానీలే బాగుపడ్డారని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు ఆరోపించారు.భారత కమ్యూనిస్టు పార్టీ 25వ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో సెప్టెంబర్ 21 నుండి 25 వరకు జరుగుతున్న సందర్భంగా ఆదివారం అమరహిత పట్టణంలోని సిపిఐ జండా కట్ట వద్ద ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా అన్ని జిల్లా సెంటర్లో మండల కేంద్రాల్లో గ్రామ శాఖల్లో అరుణ పతాక ఆవిష్కరణలు ఎగరేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే అమరచింత పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండా కట్ట దగ్గర జండా ఆవిష్కరణ చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి ఏ రవీందర్ నిర్వహించారు. అనంతరం విజయరాములు మాట్లాడుతూ ఈ దేశంలో బిజెపి హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని అకృత్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు దేశంలో మెజార్టీ హిందువులే ఆర్థికంగా వెనుకబడ్డారని వారి అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని మనుగడ కొనసాగిస్తున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో బిజెపి అల్లాహు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు.రాష్ట్రం, కేంద్రం రైతుల జీవితాల తో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ గత 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలోనే జాతీయ మహాసభలకు సంఘీభావంగా ప్రతి గ్రామంలో సిపిఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఈ అబ్రహం సహాయ కార్యదర్శి ఏ భాస్కర్ ఎస్ శ్యాంసుందర్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ రఘు ఇజ్రాయిల్ గీతమ్మ వెంకటేష్ కథలప్ప సౌలు తదితరులు పాల్గొన్నారు.(Story : గత పదేళ్ల బిజెపి పరిపాలనలో ఆదాని అంబానీ లే బాగుపడ్డారు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version