Homeటాప్‌స్టోరీమోదీ బయోపిక్ "మా వందే" 

మోదీ బయోపిక్ “మా వందే” 

మోదీ బయోపిక్ “మా వందే” 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని “మా వందే” సినిమాలో చూపించనున్నారు. ఈ రోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత వీర్ రెడ్డి.ఎం. మాట్లాడుతూ – ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత కథా చిత్రం “మా వందే”ను మా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. మోదీ గారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే “మా వందే” చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నాం. ప్రపంచనాయకుడిగా మోదీ ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి గల అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పంచనుంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకాంశంగా ఉండనుంది. మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రధాని మోదీ జీవిత విశేషాలను “మా వందే” సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నాం. అన్నారు.

నటీనటులు – ఉన్ని ముకుందన్, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
యాక్షన్ – కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – సాబు సిరిల్
ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్
డీవోపీ – కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ – రవి బస్రుర్
బ్యానర్ – సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి.
లైన్ ప్రొడ్యూసర్ – టీవీఎన్ రాజేశ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – వాల్స్ అండ్ ట్రెండ్స్
నిర్మాత – వీర్ రెడ్డి.ఎం.
రచన, దర్శకత్వం – క్రాంతికుమార్.సి.హెచ్. (Story:మోదీ బయోపిక్ “మా వందే” )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!