రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన లొయోలా స్కూల్ విద్యార్థులు.
న్యూస్ తెలుగు/వినుకొండ : గుంటూరు జిల్లా ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యానివర్శిటి లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ లో లొయోలా హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల లో జరిగిన అభినందన కార్యక్రమంలో లోయోలా హై స్కూల్ కరస్పాండెంట్ రెవ. ఫాదర్ జ్ఞానదేవన్ యస్.జే మాట్లాడుతూ. మా పాఠశాల లో 8వ తరగతి విద్యార్థి కంచర్ల నాగసాయి పెంట అధేలిన్ లో 600 మీటర్స్, 60 మీటర్స్, లాంగ్ జంప్ లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అండర్-16, 600 మీటర్స్ లో 10వ తరగతి విద్యార్థి తెల్ల మేకల వెంకట శివ ప్రసాద్ 02వ స్థానం లో నిలిచాడు. అండర్-16, 60 మీటర్స్ లో 10 వ తరగతి విద్యార్థి భువనగిరి ఏడుకొండల సాయి 02వ స్థానంలో నిలిచాడని ఈనెల 27,28,29 తేదీలలో రాష్ట్రస్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో జరిగే అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోయోలా హై స్కూల్ హెడ్ మాస్టర్ రెవ: ఫాదర్ : అవినాష్ , లోయోలా హైస్కూల్ ఫాదర్స్ రెవ. ఫాదర్ లియో యస్.జే. రెవ. ఫాదర్ మరియు జోసఫ్ బ్రదర్ జాన్ , వ్యాయామ ఉపాధ్యాయుడు బి కొండలు పాల్గొన్నారు.(Story :రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన లొయోలా స్కూల్ విద్యార్థులు. )

