అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించిన సిరి సహస్ర (సిరమ్మ)
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో పూల్ బాగ్ రోడ్డునందు గల అయ్యప్ప స్వామి ఆలయం లో జరిగే ఇరుముడి కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు గురుస్వామి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా సిరి సహస్ర సిరమ్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి యొక్క కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. కఠిన దీక్ష చేసి శబరిమలై వెళ్తున్న స్వాములు అందరికీ అయ్యప్ప స్వామి అండగా ఉంటారని తెలిపారు. తాను చిన్ననాటి నుండే అయ్యప్ప స్వామిని ఎంతో ఇష్టంగా పూజిస్తుంటానన్నారు. ఈ కార్యక్రమం లో సోము అప్పారావు కుటుంబ సభ్యులు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. (Story;అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించిన సిరి సహస్ర (సిరమ్మ))

