Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

న్యూస్‌తెలుగు/ విజయనగరం: పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అమర్ పాఠశాలలో వినాయక ముగింపు ఉత్సవాల అనంతరం మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని విద్యార్థుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి. ఇందుమతి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే పండగల యొక్క విశిష్టతను తెలిపేందుకే ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఈ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రతి అంశంపై వారికి అవగాహన ఉంటుందన్నారు. అతి తక్కువ ఫీజులతో పాఠశాల ఎన్నో ఉన్నత విజయాలు పొందిందన్నారు. పాఠశాలలో కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి పండగపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి రాంబాబు, వైస్ ప్రిన్సిపల్ ఏ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story:అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!