యూరియా కష్టాలకు బాధ్యత
కేంద్రానిదే : సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి: రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ విమర్శించారు. యూరియా సరఫరా లో పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ గోపాల్పేట ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. తాసిల్దార్ పాండుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం సకాలంలో సరఫరా చేసి ఉంటే కష్టాలు వచ్చేవి కావన్నారు. పనులు వదులుకొని బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పడిగా పలికాస్తున్నారని, దొరకక నిరాశతో వెళ్ళిపోతున్నారన్నారు. వరిపైర్లు పొట్ట కొరకు దశకు వస్తున్నాయని యూరియా వేయకుంటే దిగుబడి తగ్గుతుందని, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పానగల్ పి ఎస్ సి ఎస్ లో ఆరవ తేదీన పేర్లు నమోదు చేసుకున్న వారికి 15వ తేదీన యూరియా ఇచ్చారన్నారు. గోపాల్పేటలో నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్న యూరియా దొరకటం లేదని రైతుల చెపుతున్నారన్నారు. గోపాల్పేట, గణపురం, ఆత్మకూరు, పానగల్ తదితర మండలాల్లో ఆందోళనలు జరిగాయి అన్నారు. యూరియాను పిఎసిఎస్ ల వద్దనే కాకుండా రైతు వేదికల వద్ద గ్రామాల్లోప్రవేట్ డీలర్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయించాలన్నారు.జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, జె.చంద్రయ్య,శ్రీరామ్, కృష్ణవేణి, జయమ్మ, గోపాల్పేట మండల కార్యదర్శి మంకలి శాంతయ్య, మండల సహాయ కార్యదర్శి కురుమూర్తి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.(Story:యూరియా కష్టాలకు బాధ్యత కేంద్రానిదే: సిపిఐ)

