సత్య డిగ్రీ కళాశాలలో ముగిసిన వారం రోజుల వర్క్ షాప్
న్యూస్‌తెలుగు/విజయనగరం :
సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్v మరియు సత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తేదీ 8 నుండి 16 సెప్టెంబర్ 2025 వరకు సాఫ్ట్ స్కిల్స్‌పై వారం రోజుల శిక్షణ శిబిరం నిర్వహించబడింది. ఈ శిక్షణను ట్రైనర్ కే.అనుష అందించారు.
ఈ కార్యక్రమం ముగింపు సమావేశం లో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి పాల్గొని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కి , ట్రైనర్ అనూష కు కృతజ్ఞతలు తెలియ జేశారు. విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి, భవిష్యత్ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ వారం రోజుల శిక్షణ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంలో, వ్యక్తిగతంగా , వృత్తిపరంగా ఎదగడంలో ప్రేరణ పొందారు. సత్య డిగ్రీ కళాశాల నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులందరికీ ఈ వర్క్‌షాప్ యొక్క సర్టిఫికెట్లను, బహుమతులను ప్రధానం చేశారు. (Story:సత్య డిగ్రీ కళాశాలలో ముగిసిన వారం రోజుల వర్క్ షాప్)

