Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కళా ఉత్సవ్ జిల్లా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కళా ఉత్సవ్ జిల్లా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

0

కళా ఉత్సవ్ జిల్లా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

న్యూస్ తెలుగు/వినుకొండ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ బోయపాలెంలో నిర్వహించిన కళా ఉత్సవ్ – 2025 పోటీల్లో స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. నాటకం విభాగంలో గిడుగు ఏకపాత్రాభినయం ప్రదర్శించిన పదో తరగతి విద్యార్థి ఇవివి శ్రీలక్ష్మి కి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో మూడవ బహుమతి లభించింది. శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, జానపద నృత్యంలో విద్యార్థులు పాల్గొని ప్రశంసలు పొందారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతి పొందిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి.శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు గైడ్ ఉపాధ్యాయినిగా డాక్టర్ వి. పద్మ వ్యవహరించారు.(Story : కళా ఉత్సవ్ జిల్లా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version