సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కె విజయరాములు మండల కార్యదర్శి అబ్రహం డిమాండ్ చేశారు. శనివారం అమరచింత పట్టణంలో సిపిఐ మండల కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని నడిపింది కమ్యూనిస్టులు అని గుర్తు. గత ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారని ఆరోపించారు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూరియా కొరత పై వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. యూరియా కొడతాను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. యూరియా లేఖ రైతులు ఆగమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉండడం బాధాకరమన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తుందని ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా మాకు కమ్యూనిస్టులు మాత్రమే పోరాటం కాకుండా కలిసి వచ్చే శక్తులన్నీ కేంద్రంపై పోరాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గద్దె దిగితేనే ఈ దేశానికి రక్షణ ఉంటుందని ఆయన అన్నారు. సిపిఐ మండలంలోని సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించిందని సమస్యల పరిష్కారం కోసం ప్రజలను జాగృతం చేసి పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవీందర్ శ్యాంసుందర్ కుతుబ్ లక్ష్మీనారాయణ తో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.(Story : సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి )

