జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు ఘనంగా వీడ్కోలు
న్యూస్తెలుగు/విజయనగరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ అంబేద్కర్ తమ విధుల నుంచి వైదొలిగారు. పలువురు జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సిబ్బంది కలెక్టర్ ను ఛాంబర్లో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. శాలువలతో సత్కరించారు. పలువురు ప్రజా ప్రతినిధులు కూడా కలెక్టర్ ను కలిసి అభినందించారు.(Story;జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు ఘనంగా వీడ్కోలు)

