Home వార్తలు తెలంగాణ ఐలమ్మ స్ఫూర్తితో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలి: కృష్ణవేణి

ఐలమ్మ స్ఫూర్తితో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలి: కృష్ణవేణి

0

ఐలమ్మ స్ఫూర్తితో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలి: కృష్ణవేణి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి :  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, హక్కుల సాధనకై పోరాడాలనిNFIW జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి పిలుపునిచ్చారు. ఈరోజుఐలమ్మ 40వ వర్ధంతిని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి శ్వేతా నగర్ ఆఫీస్ లో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పండించిన పంట ను అన్యాయంగా తరలించకపోతున్న విసునూరు దొర రామచంద్ర రెడ్డి పై తిరగబడి తరిమికొట్టిందన్నారు. తుపాకి ధరించి భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దూకిందన్నారు. కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదని ఆ పోరాట స్ఫూర్తిని మహిళలు పునికి పుచ్చుకోవాలి అన్నారు. ఇప్పటికీ మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, వరకట్నం వేధింపులు ఆగటం లేదన్నారు. వ్యతిరేకంగా పోరాడాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు శిరీష, భూమిక, వెంకటమ్మ, శ్రీదేవి, జ్యోతి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. (Story:ఐలమ్మ స్ఫూర్తితో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలి: కృష్ణవేణి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version