చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు ) సిపిఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో( చాకలి) చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సుభాష్ చౌరస్తా లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఊసన్న అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు పాల్గొని ప్రసంగిస్తూ” వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులే ఆర్ఎస్ఎస్- బిజెపి హిందూ ముస్లిం కొట్లాటగా వక్రీకరించి చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. చరిత్ర కు వక్రభాష్యాలు చెప్పడం అబద్ధాలను ప్రచారం చేయడం బిజెపికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు చిట్యాల ఐలమ్మ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని ఆమె నిజాం రాజు పరిపాలనలో విసునూరు దేశముకు రామచంద్ర రెడ్డి హిందూ భూస్వామి కి వ్యతిరేకంగా తన భూమి రక్షణ కోసం సమరశీలంగా పోరాడారని కొనియాడారు కొండలరావు దగ్గర భూమి కవులకు తీసుకొని భూమి సాగు చేసుకుంటున్నా ఐలమ్మ భూమిపై విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి భూస్వామి కి కన్ను పడింది. దేశముకు రామచంద్ర రెడ్డి గూండాలను పంపి ఆమె పొలంలో పంటను కోసుకుపోవడానికి ప్రయత్నించగా కమ్యూనిస్టు నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో తిరుగుబాటు చేసి గుండాలను తరిమికొట్టి, ఐలమ్మ పంటను కోసి నూర్పిడి చేసి ఐలమ్మ ఇంట్లో వేశారు. అదే రాత్రి ధాన్యాన్ని తీసుకుపోవడానికి గుండాలను పంపారు. ఐలమ్మ ఇంటి పైకి వచ్చిన అట్టి గుండాలను కమ్యూనిస్టులు వారిపై దాడి చేసి తరిమి కొట్టారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన సహచరులను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి నోట్లో మూత్రం పోయడం జరిగింది. అనేక రకాల చిత్రహింసలకు గురిచేసిన పోరాటం ఆగలేదు. ఐలమ్మ భర్తను, కుమారులను జైలుకు పంపిన ఆమె పోరాటం ఉధృతంగా సాగించింది. తప్ప వెనక్కి పోలేదు. ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం హిందూ- ముస్లింల పోరాటం కాదు. ముస్లిం బందగి నీ ఆ కాలంలో పోరాటం చేస్తున్న అతన్ని చంపారు. సోయాబుల్లాఖాను రచయిత పైన దాడి చేసి అతన్ని చంపారు. హిందువులు – ముస్లింలు అనే తేడా లేకుండా భూస్వామ్య గుండాలు ,రాజు ప్రైవేటు సైన్యం రజాకార్లు నాలుగువేల మందిని హత్య గావించారు. 23 రకాల పన్నులు వేసి చిత్రహింసలకు గురి చేసేవారు. స్త్రీలను మానభంగాలు చేసేవారు. అనేక రకాల దోపిడీ కి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నీ బాంచన్, నీ కాల్ముక్త అనేవాళ్ళు తుపాకులు పట్టి ముస్లిం నిజాం రాజు , రజాకార్లను హిందూ భూస్వాములు, దొరలను ఓడించారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించారు. భూస్వాములను తరిమికొట్టారు. 10 లక్షల ఎకరాల భూములు పంచుకున్నారు. అంటరానితనాన్ని అంతం చేశారు. స్త్రీ- పురుష తేడా లేకుండా కలిసి జీవించారు. హిందూ- ముస్లిం తేడా లేకుండా ఉద్యమించారు. చిట్యాల ఐలమ్మ ఆశయాలు కొనసాగించడం అంటే భూ పోరాటాన్ని కొనసాగించాలి. దున్నేవానికి భూమి కోసం ఉద్యమించాలి .కుల అంతరాలకు వ్యతిరేకంగా, అంటరాని తనానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్- బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదులకు, ముస్లిం మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. మతం పేరుతో వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే ఐలమ్మ కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు నాయకులు బిసన్న గంగాధర్ వెంకటేష్ రాజు నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు. (Story :చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి)
