Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చింతూరులో చంద్రబాబు షూరిటీ- మోసం గ్యారంటీ

చింతూరులో చంద్రబాబు షూరిటీ- మోసం గ్యారంటీ

0

చింతూరులో చంద్రబాబు షూరిటీ- మోసం గ్యారంటీ

న్యూస్ తెలుగు/ చింతూరు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పిలుపుమేరకు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎండగడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన”చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజవర్గం చింతూరు మండలం చింతూరు ( ఎర్రంపేట ) మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గౌరవ ఎమ్మెల్సీ అనంత బాబు , రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిందని అందుకే వారి తరపున వారి ప్రజలు గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు పాలన తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి నూతన సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ఎలక్షన్లలో హామీలను ఇచ్చి గద్దినెక్కిన కూటమి పార్టీ ఈరోజు వాటిలో అమలు చేయడంలో కాకమ్మ కథలు చెబుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించేందుకు శ్రద్ధ చూపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల పార్టీ అధ్యక్షులు, విఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షుడు, చింతూరు జడ్పిటిసి ఎంపీపీ, వైస్ ఎంపీపీ లు ఎంపిటిసిలు ,సర్పంచులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : చింతూరులో చంద్రబాబు షూరిటీ- మోసం గ్యారంటీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version