వికలాంగుల కు చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని టైగర్ జంగయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిథులు గా టైగర్ జంగయ్య మాదిగ,గంధం గట్టయ్య మాదిగ, కొమ్ము చెన్నకేశవులు మాదిగ VHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రభాకర్ శెట్టి, పి ,శ్రీనివాసులు మాట్లాడడం జరిగింది.వికలాంగులకు వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-మరియు చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షన్ దారులతో మహాధర్న నిర్వహించడం జరిగింది.తదనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి(IAS) మెజిస్ట్రేట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము.పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం గోపినాథ్
వి హెచ్ పి ఎస్ నాయకులు,కుశకుమార్
వి హెచ్ పి ఎస్ పట్టణ అధ్యక్షులు, గట్టు స్వామి మాదిగ, ఎం ఎస్ పి నాయకులు,మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, గంధం లక్ష్మయ్య, గంధం విజయ్ మాదిగ,గంధం కృష్ణయ్య వి హెచ్ పి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బాజశేఖర్ వి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణవేణి, వి హెచ్ పి ఎస్ జిల్లా మహిళా అధ్యక్షులు, దండు శ్రీనివాసులు మాదిగ, డి ఆర్ కృష్ణ మాదిగ,పెరుమాళ్ళ రామకృష్ణ మాదిగ, సహదేవుడు మాదిగ,వర్మ మాదిగ, బండి సురేష్,విష్ణు మాదిగ వృద్ధులు వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.(Story :వికలాంగుల కు చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి )

