పెబ్బేరు మండలంలో పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం పెబ్బేరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభాలు నిర్వహించారు. మొదటిగా కంచిరావుపల్లి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తండాలోని ఆలయ నిర్మాణానికి ఆయన తన సొంత నిధులు రూ. 2లక్షలను విరాళంగా అందజేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తండాకు బీటి రోడ్డు నిర్మాణం గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఆలయ నిర్మాణంతోపాటు ప్రభుత్వ పథకాల భాగంగా రేషన్ కార్డులు రేషన్ బియ్యం ఇందిరమ్మ ఇండ్ల లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టేమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం పెబ్బేరు మండల కేంద్రంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 45 లక్షల ఖర్చుతో తరగతి గదుల బలోపేతంతో పాటు డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెబ్బేరు మండల పరిషత్ ఆవరణలో ప్లాస్టిక్ వేస్టేజ్ వేరియేషన్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు నియోజకవర్గంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ లను నిర్మించిన 5మంది భవన నిర్మాణ కార్మికుల దంపతులకు శాలువాలతో సన్మాని నూతన వస్త్రాలను అందజేసి సత్కరించారు
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు
వనపర్తి నియోజకవర్గం లో విద్యాభివృద్ధి కోసం 650 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు
పాత సుగూరు గ్రామంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభించి ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొత్త సూగూరు గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు
అనంతరం పెంచికలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వనపర్తి నియోజకవర్గంలో నేటికీ 1759 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు
విద్య వైద్యంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రేషన్ బియ్యం లాంటి పథకాలు రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధిని ఇంతకింత పెరిగేలా చేసుకోవాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి హౌసింగ్ డిఇ విటోబా, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వెంకట్రాములు, నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, దయాకర్ రెడ్డి, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి, వెంకటరమణ, వెంకటేష్ సాగర్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, పట్టణ మాజీ కౌన్సిలర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : పెబ్బేరు మండలంలో పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే )

