చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతోపాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటి చెప్పడం ఈరోజు ముఖ్యద్దేశ్యం అన్నారు. వ్యక్తులు సమాజాభివృద్ధిలో అక్షరాస్యత పాత్ర ప్రముఖమైనదన్నారు. స్థిరమైన అభివృద్ధికి అధిక అక్షరాస్యత అవసరమన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అక్షరాస్యత దినోత్సవం జరుపుకోవడం ద్వారా అక్షరాస్యత ప్రాముఖ్యతను, దాని ప్రగతిని ఎదురయ్యే సవాళ్లను గుర్తు చేసేటట్లువుతుందన్నారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ అక్షరాస్యత అనేది వ్యక్తులు తమ హక్కులను పొందేందుకు, సమాజంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి మరియు శాంతియుత ప్రపంచానికి దోహదపడటానికి వీలు కల్పిస్తుందన్నారు.ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ జి. సాయికుమార్ అక్షరాస్యతను ఉద్దేశించి 2025 సం// థీమ్ ” డిజిటల్ యుగంలో అక్షరాస్యతను మరింతగా ప్రోత్సహించడం”అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు జి. వెంకట్రావు,ఎస్. అప్పనమ్మ, కె. శకుంతల, కె. శైలజ, ఎమ్. నాగ మోహన్ రావు, ఆర్. మౌనిక,బి. శ్రీనివాసరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story :చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం )

