రైతులకు ఎరువులు ఇవ్వడంలో కూటమి విఫలం
న్యూస్ తెలుగు /సాలూరు : రైతులకు ఎరువులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూరియా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనివిని ఎరగన రీతిలో రైతులు యూరియా కోసం నెలల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పండిన పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోవడంతో దిగుబడి లేక రైతులు ఆర్థిక ఇబ్బందులు గురవుతారని అన్నారు. అందుకోసమే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పిలుపుమేరకు ఈనెల 9 వ తేదీన ఎరువులు బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరుబాట నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. యూరియా కావాలంటే పోలీసు బందోబస్తు పెట్టి ఇవ్వవలసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారని అన్నారు. ఆరోజు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు ఇస్తామంటే వైర్లు మీద బట్టలు రైతులు ఆరబెట్టుకొందురని అవహేళన అప్పటి ముఖ్యమంత్రి ఈ చంద్రబాబునాయుడు అన్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు,ఎరువులు, పురుగు మందులు, అందుబాటులో ఉండేవని తెలియజేశారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఇలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు హామీలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరి రఘు మాజీ కౌన్సిలర్లు పిరిడి రామకృష్ణ, కాకి పాండురంగ వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.(Story:రైతులకు ఎరువులు ఇవ్వడంలో కూటమి విఫలం)

