Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేడు మంగంపల్లికి రానున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేడు మంగంపల్లికి రానున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0

నేడు మంగంపల్లికి రానున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నేడు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవునున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. నేడు శనివారం ఉదయం 9:30 గంటలకు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన పోలేమోని రాధమ్మ w/o రామకృష్ణ
గారీ గృహప్రవేశానికి హాజరై ఆ దంపతులకు నూతన వస్త్రాలను అందజేయనున్నారు. కావున ఇట్టి కార్యక్రమానికి పెద్దమందడి మండలం, వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ , వైస్ చైర్మన్ లు, మహబూబ్నగర్ జిల్లా DCCB అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా గ్రంథాలయాల అధ్యక్షులు, pcc సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల SC,ST, BC, మైనార్టీ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యురాలు, NSUI సంఘం నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. (Story:నేడు మంగంపల్లికి రానున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version