Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కోట అయ్యప్ప కు  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 

కోట అయ్యప్ప కు  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 

కోట అయ్యప్ప కు  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 

న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు మండలం22 నవంబర్ 2005లో విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరిన నాటి నుండి ఈనాటి వరకు 20 సంవత్సరాలుగా విద్యార్థులకు సైన్స్ బోధించడంతోపాటు అనేక జిల్లా మరియు రాష్ట్ర సైన్స్ ఫెయిర్ లలో , సైన్స్ సెమినార్లలో తమ విద్యార్థులకు అనేక బహుమతులు పొందేటట్లుగా విద్యార్థులను తయారు చేశారు. అనేక పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ క్లబ్ ద్వారా సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా మొబైల్ లాబరేటరీ లో రిసోర్స్ పర్సన్ గా , ఉపాధ్యాయుల ట్రైనింగ్లలో మరియు దీక్షా కంప్యూటర్ యాప్ లో రిసోర్స్ పర్సన్ గా , ఉపాధ్యాయులకు అవసరమయ్యే మాన్యువల్స్ తయారీలో రిసోర్స్ పర్సన్ గా. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో రిసోర్స్ పర్సన్ గా మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ గా మన్యం జిల్లా కౌశల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో మరియు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైన్స్ నాటికలను ప్రదర్శిస్తుంటారు. ఆహారంలో జరుగుతున్న కల్తీలను ఏ విధంగా పరీక్షించాలి అని విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు ప్రయోగాలను అవగాహన కల్పిస్తుంటారు.తక్కువ ఖరీదుతో బోధన పరికరాలు తయారు చేసి విద్యార్థులకు ఆసక్తికరంగా సైన్స్ ని బోధిస్తారు. జాతీయ పర్యావరణ దినోత్సవం, హిరోషిమా, నాగసాకి దినోత్సవం, ఓజోన్ దినోత్సవం, స్పేస్ డే , సైన్స్ డే వంటి కార్యక్రమాలను పాఠశాలలో ఆసక్తికరంగా నిర్వహిస్తుంటారు. 2022 సంవత్సరంలో మన్యం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. (Story :కోట అయ్యప్ప కు  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!