ప్రిన్సిపాల్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
న్యూస్ తెలుగు/ చింతూరు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు కు ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ప్రధానం చేసింది. రాజమండ్రి లో ఆనంకళాక్షేత్రం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ అభినందన సభలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ సాంస్కృతిక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆయన మెమెంటో, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్ తో పాటుగా 20 వేల రూపాయలు చెక్ కూడా బహుకరించారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు సేవనీరతిని, విద్యార్థులు అభివృద్ధికి గల అంకిత భావాన్ని కొనియాడారు.(Story : ప్రిన్సిపాల్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు )

