ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవీ ప్రజాదర్బార్
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రజా దర్బార్ కు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్ విప్ జీవి ని కలసి సమస్యలు వివరించవచ్చని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు చీఫ్ విప్ జీవి స్వయంగా స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారని పేర్కొన్నారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. (Story:ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవీ ప్రజాదర్బార్)
