Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

న్యూస్ తెలుగు/సాలూరు : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ద్వారా డ్రోన్లు వినియోగించుకొని పురుగు మందులు పిచకారి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష అన్నారు. బుధవారం సాలూరు మండలం, తోనాం పంచాయతి ముంగివానివలస. మరియు గుడ్డాంగనివలస రెవెన్యూ గ్రామాల్లో ఆమెతోపాటు, ఉద్యాన శాఖ అధికారి ప్రత్యూష భాను మరియు రాస్తకుంటభాయి శాస్త్రవేత్తలు అయిన ఏ శ్రీనివాసరాజు మరియు అమృతవీన ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న లో యాజమాన్య పద్దతలు తెలియచేసారు, రైతులు యూరియా మోతాదుకు మించి వినియోగించడం వలన పంట పురుగులు మరియు తెగుళ్ల బెడదకు గురి అవుతుంది కనుక తగిన మోతాదులో మాత్రమే యూరియా పంటకు వినియోగించాలని తెలియచేశారు. అలానే రైతులందరూ వ్యవసాయ సహాయకులు ని సంప్రదించి ఈ పంట తప్ప కుండా చేసుకోవాలని తెలియచేశారు,మరియు ప్రస్తుత పరిస్థితులలో నానో యూరియా, డి ఏ పి వాడుక ,మరియు కలుగు లాభాలు గూర్చి వివరించడం జరిగింది. అలానే ప్రస్తుత వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతి అయినటువంటి డ్రోన్ ద్వారా రసాయనిక మందులు పిచికారీ చేస్తే కలుగు లాభాలు మరియు ఖర్చు తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలానే సమయం కూడా ఆదా అవుతుందని తెలియచేశారు. అలానే రస్తకుంటభాయి శాస్త్రవేత్తలు అయిన ఏ శ్రీనివాసరాజు మరియు అమృతవీణ మాట్లాడుతూ అరటి లో ఎరువుల యాజమాన్యం మరియు తెగుళ్లు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేశారు మరియు ఉద్యాన శాఖ అధికారి అయిన శ్రీమతి ప్రత్యూష భాను మాట్లాడతూ పామాయిల్ పంట యాజమాన్యం గురించి తెలియచేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, దీక్ష వెల్ఫేర్ సీఈఓ శాంతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. (Story:వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!