వాసవి క్లబ్ వారోత్సవాలు
న్యూస్ తెలుగు/విజయనగరం : వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా కొత్త పేట కుమ్మరి వీధి లోగల శ్రీ స్వామి వివేకానంద ప్రాథమికోన్నత పాఠశాల 5 వతరగతి విద్యార్థులకు జవహర్ నవోదయ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ మెటీరియల్ తెలుగు, ఇంగ్లీష్ బుక్స్ అందజేశారు.వాసవి క్లబ్ వారోత్సవాలు సందర్బంగా మంగళవారం అధ్యక్షులు విజ్జపు విజయ్ కుమార్ మాట్లాడుతూ వారోత్సవాలలో భాగంగా గురువులను సన్మానించుట, వృద్ధులను సముచితరీతిన గౌరవించుట, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేయుట, సమాజానికి నిరంతరం సేవలు అందిస్తున్న జర్నలిస్టలకు, పేపర్ బాయ్స్ కు సత్కారాలు చేయుట జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా మంగళవారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాద వితరణ చేసినట్లు, పూజారులు కూర్చునేందుకు స్టూళ్లు అందజేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వి.బుచ్చిరాజు, వాసవి క్లబ్ జిల్లా కాబినెట్ సెక్రటరీ ఆలవెల్లి శేఖర్,ప్రాజెక్ట్ చైర్మన్ అడ్డా నరసింగరావు, మాచర్ల చంద్రశేఖర్ గుప్త, రీజియన్ సెక్రటరీలు కట్టమూరి రత్నారావు, సముద్రాల నాగరాజు, క్లబ్ కార్యదర్శి కంచర్ల నానాజీ, కోశాధికారి వజ్రపు కృష్ణారావు, చిట్టూరి మురళీ కృష్ణ, కందుల సంతోష్, ఏ.వి.ఎస్. కుమార్ తదితరులు పాల్గొన్నారు.(Story : వాసవి క్లబ్ వారోత్సవాలు )

