తల్లికి వందనం పై ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తాం
మున్సిపల్ అధికారులకు చీఫ్ విప్ జీవీ హెచ్చరిక
న్యూస్ తెలుగు/వినుకొండ : పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఒకటో వార్డు పరిధిలోని సిద్ధార్థ నగర్ లో పర్యటించారు. పెన్షన్లు పంపిణీ చేసే క్రమంలో పలువురు మహిళలు తమకు తల్లికి వందనం డబ్బులు పడలేదని కొందరు మహిళలు జీవికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవి, మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తూ సర్వే పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేదు మరల ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత వ్యక్తులను సస్పెండ్ చేయడం జరుగుతుందని జీవి హెచ్చరించారు. పూర్తిస్థాయి విచారించి సంబంధిత లబ్ధిదారులకు తల్లికి వందనం అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ఆదేశించారు. (Story:తల్లికి వందనం పై ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తాం)

