గృహాల మధ్యలో నిలిచిన మురుగుపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహించిన జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం పెన్షన్లు పంపిణీలో భాగంగా స్థానిక సిద్ధార్థ నగర్ లో పర్యటిస్తున్న క్రమంలో గృహాల మధ్యలో భారీగా నిలిచిపోయిన మురుగును చూసి ఆగ్రహించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను సానిటరీ అధికారి ఎస్ కే ఇస్మాయిల్ ను చూడండి అయ్యా ఈ మురుగు చూడండి. గృహాల మధ్యలో ఈ మురుగు నిలిచిపోవడం ఏమిటి తక్షణం మురుగును తొలగించాలని జీవి అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయిందని తక్షణం తగు చర్యలు చేపడతామని మున్సిపల్ అధికారులు వివరించారు.(Story: గృహాల మధ్యలో నిలిచిన మురుగుపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహించిన జీవి)

