నిన్న సజీవం -నేడు నిర్జీవం
ఏజెన్సీలో నాటు పడవలే ఆధారం
న్యూస్ తెలుగు/ చింతూరు : రోజుల తరబడి వానలు కురిసి చింతూరు మండలం లో సోకిలేరు,శబరి, సీలేరు, చీకటి వాగు పొంగి ప్రవహించడంతో గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో గత వారం పది రోజులుగా ఉన్నాయి. దీనివల్ల చింతూరు మండలానికి చేరాలంటే రహదారులు మూసుకుపోవడంతో నాటు పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది. వైద్యం చేయించుకోవాలంటే చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి నాటు పడవలే శరణ్యం. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా నిన్న సజీవంగా ఆస్పత్రికి వెళ్ళిన సుబ్బమ్మ, నేడు నిర్జీవంగా ( చనిపోయి) ఇంటికి చేరాల్సి వచ్చింది. ఏజెన్సీ దుస్థితి ఇలా ఉంది. వివరాల్లోకి వెళితే వరద కారణంగా రహదారులన్ని బంద్ అవటంతో వి ఆర్ పురం మండలం కుంజ వారిగూడెం గ్రామానికి చెందిన బొడ్డు. సుబ్బమ్మ (65) రక్త హీనతతో బాధపడుతుంది. నిరసించిపోయింది. దీనివల్ల కుటుంబీకులు ఆటోపై తీసుకొచ్చి సోకులేరు వద్ద నాటు పడవ ఎక్కించారు. అనంతరం ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. దీంతో చేసేదిలేక ఆమెను నిర్జీవంగా ( మృతదేహాన్ని) మరల ఆటోలో తీసుకొచ్చి సోకలేరు వద్ద నాటు పడవ ద్వారా కుంజావారి గూడెం తరలించారు. అనంతరం అంతిమ కార్యక్రమాలు చేశారు. రహదారుల సౌకర్యం లేకపోవడంతో ఇలా గాలిలో ప్రాణాలు కలిసిపోతున్నాయి.(Story : నిన్న సజీవం -నేడు నిర్జీవం )

