Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

0

పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

తహసిల్దార్ సురేష్ నాయక్

న్యూస్ తెలుగు/వినుకొండ  : పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం వినుకొండ మండల పరిధిలోని విఠంరాజు పల్లి ఎస్సీ కాలనీలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం తాసిల్దార్ ఎం సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాలనీలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన కోరగా, కాలనీలో త్రాగునీటికి ఉపయోగకరంగా లేని భావి శిథిలావస్థలో ఉందని, ఆ బావిని మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని పలువురు కోరారు. దీంతో సంబంధిత అధికారులు భావిని మరమ్మతులు చేపట్టి త్రాగునీరు అందేలాగా చూడాలని పంచాయతీ అధికారులను తాసిల్దార్ ఆదేశించారు. అలాగే కాలనీలో ఎక్కడ మురుగునీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని తాసిల్దార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్టి సుందర్ రెడ్డి, ఆర్ ఐ. శ్రీహరి, ఎస్సై స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.(Story : పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version