Home వార్తలు “దేవసస్య” లిరికల్ సాంగ్ రిలీజ్

“దేవసస్య” లిరికల్ సాంగ్ రిలీజ్

0

“దేవసస్య” లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : సెల్విన్ దేశాయ్, ఆహన్, బింబిక రావ్, ప్రకాష్ బేల్వాడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “దేవసస్య”. ఈ చిత్రాన్ని అనంత ఫిలింస్ బ్యానర్ పై అనంతమూర్తి హెగడే నిర్మిస్తున్నారు. కార్తీక్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో “దేవసస్య” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఇందుమామ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇందుమామ పాటకు శ్రీకాంత్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. హరి అజయ్ మంచి ఫోక్ బీట్ తో కంపోజ్ చేశారు. ఇందు మామ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఇందుమామ ఇందుమామ ఇందుమామ కట్టం కుట్టం అంటవ్ దరువేయ్ ఇందుమామ, ఇందుమామ ఇందుమామ ఇందుమామ కేకవేసి కబురెట్టేసేయ్ ఇందుమామ, హే మామ ఇందుమామ హే మామ ఇందుమామా..’ అంటూ సాగుతుందీ పాట. ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో డిజైన్ చేసిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

నటీనటులు – సెల్విన్ దేశాయ్, ఆహన్, బింబిక రావ్, ప్రకాష్ బేల్వాడి, గీతా సిద్ధి, మంజునాథ్ హెగడే, తదితరులు

టెక్నికల్ టీమ
ప్రొడ్యూసర్ – అనంతమూర్తి హెగడే
బ్యానర్ – అనంత ఫిలింస్
రచన, దర్శకత్వం – కార్తీక్ భట్
డీవోపీ – రాజు.ఎన్.ఎం
ఎడిటర్, కలరిస్ట్, వీఎఫ్ఎక్స్ – ప్రజ్వల్.ఆర్
మ్యూజిక్ – హరి అజయ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడక్షన్ డిజైనర్ – కేజీఎఫ్ కిరణ్
యాక్షన్ – అల్టిమేట్ శివ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సంతోష్ నాయక్ బ్యగడ్డే (Story:”దేవసస్య” లిరికల్ సాంగ్ రిలీజ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version