యూరియా కొరతపై బి.ఆర్.ఎస్ ఆందోళన
వ్యవసాయ కమిషనరేట్ ముట్టడిలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన యూరియా కొరతను నిరసిస్తూ మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులతో కలసి ముట్టడించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ
10ఏండ్ల కాలములో కె.సి.ఆర్ గారి ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతులకు సకాలములో యూరియా అందించి రైతులను ఆదుకున్నారని అన్నారు. వ్యవసాయ సీజన్ వచ్చేనాటికి కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి యూరియాను దిగుమతి చేసుకొని నిల్వ ఉంచారని అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి వారి దగ్గర ఎక్కువ ఉన్న యూరియాను దిగుమతి చేసుకొని రైతులకు అండగా నిలిచారని కొనియాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరదలు వచ్చినా,రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి తమ నిరసన వ్యక్తం చేసిన పట్టించుకోకుండా బీహార్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న విషయం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా యూరియా కొరతపై సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ కమిషనర్ కి వినతి పత్రం అందించారు.(Story:యూరియా కొరతపై బి.ఆర్.ఎస్ ఆందోళన)
