ఎండిఓ ఆధ్వర్యంలో 16వ విడత సామాజిక తనిఖీ సమావేశం
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ఎండిఓ సుండం శ్రీనివాస్ దొర ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ సమన్వయ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. చింతూరు మండలంలో 2024 -25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం నందు వివిధ పనులకు సుమారు వేతన రూపంలో 13 కోట్లు, మెటీరియల్ రూపంలో పనులు చేయటం జరిగింది. ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సామాజిక దానికి బృందం వారు గ్రామపంచాయతీ లోని ప్రతి గ్రామంలో ఉపాది హామీ పథకం నందు పనిచేసిన శ్రామికులను కలిసి క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను పరిశీలించడం జరిగింది. మండలంలో జరుగు 16వ విడత నందు ఉపాధి హామీ పథకంలో పనిచేయు సామాజిక తనిఖీ బృందం వారు గ్రామపంచాయతీ కార్యదర్శులు,ఐటిడిఏ, ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్ట్ శాఖ ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎండిఓ తో పాటు డిప్యూటీ ఎండిఓ గుంపెనపల్లి మోహన్రావు, ఎస్ ఆర్ పి ఎం శ్యామ్ రాజా, సామాజిక తనిఖీ బృందం, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఐ టి డి ఏ, ట్రైబల్ వెల్ఫేర్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : ఎండిఓ ఆధ్వర్యంలో 16వ విడత సామాజిక తనిఖీ సమావేశం )

