చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
న్యూస్ తెలుగు/ చింతూరు: చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషాదినోత్సం హిందీ విభాగాధిపతి కె. శైలజ అధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ,విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్న ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు గ్రామం లో 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించిన గిడుగు వెంకట రామమూర్తి వ్యహరిక భాషోద్యమంలో పాల్గొని తెలుగు భాష సరళమైన ప్రజల వాడుక భాష గా అభివృద్ధికి కృషి చేసిన గొప్ప కవి, రచయిత అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్ప తనం, భావజాలం గొప్పదనన్నారు. హిందీ విభాగాధిపతి కె. శైలజ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి కృషి ఫలితంగా తెలుగు వ్యహరిక భాష గా, వాడుక భాషగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. 1966 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగును అధికార భాష గా గుర్తించారన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు జి. వెంకట్రావు ,యస్ .అప్పనమ్మ ,కె.శకుంతల,జి.హరతి, యం. నాగ మోహన్ రావు , జి.సాయి కుమార్, బి. శ్రీనివాస్ రావు, ఆర్. మౌనిక, యన్.ఆనంద్, మోనిక, వివిఎస్. మూర్తి, సంగం నాయుడు, శీనయ్య, కన్నయ్య, సుబ్బారావు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.(Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం)