Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అర్హులైన వారందరికీ చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ సాయం*

అర్హులైన వారందరికీ చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ సాయం*

అర్హులైన వారందరికీ చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ సాయం*

విమర్శలు చేసేవారు ఒక్కసారి ప్రభుత్వాస్పత్రులకు రావాలి

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు /వినుకొండ : అర్హులైన వారందరికీ లేదనకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా ప్రభుత్వం 5ఏళ్లలో చేసిన సాయాన్ని కూటమి ఏడాదిలో అధిగమించడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా ఇచ్చినా ఆగని సంక్షేమం, అభివృద్ధి, సీఎంఆర్‌ఎఫ్ సహాయ పంపిణీలే చంద్రబాబు-అతడికి మధ్య తేడా అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయం లో 73 మంది లబ్ధిదారులకు రూ.38.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 500 కోట్లు పైగా, వినుకొండ నియోజక వర్గంలో 832 మంది లబ్ధిదారులకు రూ.5 కోట్ల 79 లక్షల 49 వేల 978 సీఎంఆర్ఎఫ్‌ సాయం చేశామన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ.. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సంప్ర దిస్తే తప్పక సాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగానే రూ.1129 కోట్లతో 4,472 గ్రామాల్లో ఏర్పాటుచేయనున్న విలేజ్ క్లీనిక్‌ల గురించి ప్రత్యేకంగాప్రస్తావించారు చీఫ్‌విప్ జీవీ. అక్కడికే వైద్యులు వచ్చి పరీక్షలుచేసి మందులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఆస్పత్రులకు వెళితే కనీసం ఔషధాలు లేని దుస్థితులు చూశామన్నారు. ఆస్పత్రుల్ని నిర్వీర్యం చేయడమే కాక నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడా రని మండిపడ్డారు…….

*బొల్లా వచ్చినా మంచి వైద్యం, మందులిచ్చి పంపిస్తాం….

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ సందర్భంగానే స్థానిక ప్రభుత్వాస్పత్రుల్లో మందుల్లేవు, మందులు అమ్ముకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు చీఫ్‌విప్ జీవీ. దమ్ముంటే వచ్చి ఆ విషయం నిరూపించాలని సవాల్ చేశారు. ఆయనే వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్యం,నెంబర్‌-1 మందులు ఇచ్చి పంపి స్తామన్నారు. నోటికొచ్చినట్లు విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని నిజాలు మాట్లాడితే బావుటుందని హితవు పలికారు. బొల్లా పాపం పండింది కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని చురకలు వేశారు. వారి హయాంలో స్థానిక ప్రభుత్వాస్పత్రుల్లో రోజుకి 10మంది ఓపీ కూడా ఉండేది కాదని, ఇప్పుడది 100 పైగా నమోదవుతోందన్నారు. అందుకే విమర్శలు చేసే బొల్లా అతడి టీమ్‌లో ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే స్వయంగా వాళ్లకే అన్నీ నిరూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి యాదవ్, బొంకూరి రోశయ్య, పీవీ సురేష్ బాబు, పెమ్మసాని నాగేశ్వరరావు, రియల్ ఎస్టేట్ జానీ, తదితరులు పాల్గొన్నారు. (Story:అర్హులైన వారందరికీ చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ సాయం*)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!