Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బషీర్ బాగ్ అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి లకు జోహార్లు

బషీర్ బాగ్ అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి లకు జోహార్లు

బషీర్ బాగ్ అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి లకు జోహార్లు

అమరవీరుల సాక్షిగా కరెంటు ఉద్యమం కొనసాగింపు. ప్రతినబూనిన వామపక్షాలు.

రాష్ట్రంలో పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి.

కరెంటు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి.

అవినీతి సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేయాలి.

మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి,

గోపాలరావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు.

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్రంలో బషీర్బాగ్ అమరవీరుల సాక్షిగా మరో కరెంటు ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిన చేయడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోపాలరావు తెలిపారు.వామపక్షాల పిలుపుమేరకు గురువారం నాడు సాయంత్రం ఐదు గంటలకు వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో నిరసన కార్యక్రమం అమరవీరుల సాక్షిగా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 15 వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ చార్జీల పేరుతో మరో 12 వేల కోట్ల రూపాయల ఛార్జీల పెంపుదల ఆలోచనలు విరమించుకోవాలని, అవినీతి తో కూడిన ప్రజా వ్యతిరేకమైన కరెంటు స్మార్ట్ మీటర్ల బిగింపును విరమించుకోవాలని, సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ప్రజలపై ఈ ఒప్పందాల ఫలితంగా స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు చార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయని ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించిన ఫలితంగా 500 వచ్చే కరెంటు బిల్లు 1500 రూపాయలు వస్తుందని వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 3 వేల రూపాయలు వస్తోందని అందువల్ల స్మార్ట్ మీటర్లు బిగించినయడల వాటిని పగలగొడతామని ఆ మీటర్లు బిగించడానికి వచ్చినవారికి ఖచ్చితంగా తెలపాలని వారన్నారు. సెల్ ఫోన్ లో రీఛార్జి ఏ విధంగా చేసుకుంటామో ఈ స్మార్ట్ మీటర్లలో ఆ విధంగా రీఛార్జి చేసుకోవాలని రీఛార్జి అయిపోయిన వెంటనే కరెంటు పోతుందని ఇది ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులని వారు తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోము అని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్న సోలార్ ఎనర్జీ, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను ఆనాడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించిన తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు ఏ విధంగా వాటిని అమలు చేస్తుందని వారు ప్రశ్నించారు ఈ విధంగా కరెంటు చార్జీలు మోపడాన్ని ప్రజలను మోసం చేయడమేనని వారు తీవ్రంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన కరెంటు చార్జీలు విరమించుకోవాలని స్మార్ట్ మీటర్ల బిగింపును సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేని ఎడల బషీర్బాగ్ అమరవీరుల సాక్షిగా మరో కరెంటు ఉద్యమాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏయ్ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు యం. సుబ్బారావు, సిపిఐ పిన్నిబోయిన వెంకటేశ్వర్లు,ఎ. పవన్ కుమార్, కొప్పరపు మల్లికార్జునరావు, షేక్ మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, బి.నాగ బ్రహ్మం, సిపిఎం నాయకులు కే హనుమంత రెడ్డి, బొంకూరు వెంకటేశ్వర్లు, కె చిదంబరం, నవీను, జాన్ సిపిఐ ఎంఎల్ లేబరేషన్ నాయకులు షేక్.ఫిరోజ్, భాస్కర్, ప్రసాదు లింగాచారి తదితరులు పాల్గొన్నారు.(Story : బషీర్ బాగ్ అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి లకు జోహార్లు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!