సెప్టెంబర్ 5న “లిటిల్ హార్ట్స్”
ఈ రోజు ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్ తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా, ‘మళ్లీశ్వరివే..’ సాంగ్ ఫేమ్ జెస్సీ గిఫ్ట్ పాడారు. ‘చదువూ లేదు’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ చదువూ లేదు సంధ్యా లేదు, అయినా సూడు సిగ్గే రాదు, పైకే లెవెలూ చూశావ బ్రదరూ, లేదే ఫియరూ, ఏంటీ తీరు, ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా, చాతేమీ కాదంటా అయ్యో శుంఠా..’ అంటూ సాగుతుందీ పాట. సగటు మేడిన్ తెలుగు స్టూడెంట్ ఎలా ఉంటాడో ఈ పాటలో చూపించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లోనూ ఇదే ఆదరణ దక్కుతుందని “లిటిల్ హార్ట్స్” టీమ్ నమ్మకంతో ఉంది.
నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న (Story: సెప్టెంబర్ 5న “లిటిల్ హార్ట్స్”)
